జైల్లో కూడా కాపురం చేసుకోవచ్చట...

January 07, 2015 | 11:38 AM | 63 Views
ప్రింట్ కామెంట్

జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకూ శృంగారం ప్రాథమిక హక్కు అని, శిక్ష అనుభవిస్తున్న దంపతులు కాపురం చేసుకోవచ్చునని పంజాబ్, హర్యానా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మరణశిక్ష పట్ట ఖైదీ జంట దాఖలు చేసిన పిటీషన్ విచారించిన హైకోర్టు వారు బిడ్డకు జన్మనివ్వడానికి కూడా అంగీకారం తెలిపింది. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో ఒక జంట మరణదండన ఎదుర్కొంటూ, పాటియాల సెంట్రల్ జైల్లో ఉన్నారు. తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమని, తన పెళ్లయిన ఎనిమిది నెలలకే అరెస్ట్ చేశారని భర్త కోర్టుకు వివరించి, భార్యతో కలసి జీవించడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతించాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, బిడ్డకు జన్మనిచ్చే హక్కు ఉంటుందని, నిందితులు, ఖైదీలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ