ఇంత వయసొచ్చినా ఈమె ఇంకా గ్లామర్ తారగా పిలిపించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ అలనాటి నటి బీహార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోందా? అవుతోందట. తన అందంతో ఆకట్టుకుంటూ రేఖ.. బస్ ఏక్ బార్ మేరా కహా మాన్... అంటూ బీహార్‌కొచ్చే పర్యాటకులను పలకరించబోతోంది. గుజరాత్ ప్రభుత్వం టూరిస్టులను ఆకర్షించేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా తమ టూరిస్టులను ఎట్రాక్ట్ చేసేపనిలో పడింది. అందుకే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్, అందాల నటి రేఖను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని డిసైడయింది. బీహార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు రేఖా కూడా ఓకే చెప్పినట్టు బీహార్ టూరిజం మంత్రి జావెద్ ఇక్బాల్ అన్సద్ అనౌన్స్ చేశారు. ప్రసిద్ద నటి రేఖ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల బీహార్ పర్యాటక రంగానికి మరింత ఆదరణ పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు బీహార్ పర్యాటక మంత్రి ఇక్బాల్ అన్సద్. త్వరలోనే అధికారులు ఆమెను కలిసి తమ అభ్యర్ధనను తెలియజేసి ఆమె ఆమోదం తీసుకుంటామని, రేఖతోబాటు ప్రముఖ మాటల, పాటల రచయిత జావెద్ అక్తర్‌ను మరో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు అన్సద్ తెలిపారు. ప్రముఖ బౌధ్ద కేంద్రాలకు నిలయంగా ఉన్న బీహార్‌ను సందర్శించేందుకు అధిక సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే వ్యక్తిగా రేఖ సక్సెస్ అవుతారన్న నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.