నేతాజీ కుటుంబంపై నెహ్రూ నిఘా!!

April 10, 2015 | 12:35 PM | 73 Views
ప్రింట్ కామెంట్
jawaharlal_Nehru_spied_om_Bose_family_niharonline

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పద రీతిలో అద్రుశ్యమైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికీ బతికి ఉన్నాడని కొందరు, లేదు ఫ్లైట్ కూలిపోయిన సమయంలోనే చనిపోయాడని కొందరు వాదిస్తూనే ఉంటారు. అయితే తాజాగా నిఘా నేత్రం ఇంటలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన ఓ సమాచారం దేశం మొత్తాన్ని షాక్ కి గురయ్యేలా చేస్తోంది. సుభాష్ చంద్రబోస్ అద్రుశ్యమయ్యాక 1948 నుంచి దాదాపు 20 ఏళ్లపాటు ప్రభుత్వం నేతాజీ కుటుంబంపై నిఘా నిర్వహించిందట. తాజాగా బహిర్గతమైన రెండు ఇంటలిజెన్స్ ఫైళ్లు ఈ విషయాలను బట్టబయలు చేశాయి. ఫైళ్లలోని సమాచారం ప్రకారం కోల్ కతాలోని బోస్ కు చెందిన 1 ఉడెన్ బర్గ్ పార్క్, 38/2 ఎల్గిన్ రోడ్ లోని రెండు నివాసాలపై ఐబీ నిఘా ఉంచిందట. వాటిపై నేరుగా ప్రధానిగా ఉన్న నెహ్రూకు నివేదిక ఇచ్చేవారట. బోస్ కుటుంబ సభ్యులు రాసిన లెటర్ కాపీలు, వారు దేశంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ప్రయాణించేవారో ఐబీ ఎప్పటికప్పుడూ నివేదిక సమర్పించేదట. 1947 నుంచి 1964 మరణించే వరకు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. అప్పటిదాకా బోస్ ఫ్యామిలీకి సంబంధించిన ఆయా నివేదికలు నెహ్రూకు చేరేవట. బోస్ కు సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేసేందుకు కేంద్రం ఇటీవల నిరాకరించిన విషయం తెలిసిందే. ఇందుకుగల కారణాలు తెలపాలంటూ తాజాగా కలకత్తా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మరుసటి రోజే ఫైళ్ల వివరాలు బయటపడటం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ