కిరాతకంగా తండ్రిని చంపి వీడియో తీశారు

May 14, 2016 | 01:32 PM | 18 Views
ప్రింట్ కామెంట్
meerut-sisters-killed-father-video-niharonline

కిరాతకంగా తండ్రిని చంపడంతో పాటు తాము చేసిన నేరాన్ని గురించి చెబుతూ మీరట్ కు చెందిన అక్కా చెల్లెళ్లు వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కలకలం రేపుతోంది. ఓవైపు వీడియో వైరల్ అవుతుండగా, పోలీసులు మాత్రం అస్సలు దాన్ని నమ్మడం లేదు. మీరట్ పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం, ఈ బాలికల తండ్రి కరణ్ సింగ్ నిత్యమూ తాగుతుంటాడు. నిన్న తెల్లవారుఝామున నియంత్రణలో లేని స్థితిలో ఇంటికి చేరుకోగా, ఆ మత్తులో అతని తల బావి గోడకు తగిలి తీవ్ర గాయమై బావిలో పడ్డాడు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెబుతున్నారు. కానీ, కన్నకూతుళ్లు చెబుతున్న కథనం మాత్రం వేరు.

                        కళ్లల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి ప్రతి నిత్యమూ బూతులు తిడుతున్నా భరించామని, కానీ, తప్పతాగి తమపై అఘాయిత్యం చేయబోయాడని, తట్టుకోలేక ఈ ఘోర నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఓ సుత్తి తీసుకుని అతని తలపై బాదాము. కనీసం అతను చస్తేనైనా మాకు సమస్యలు తగ్గుతాయని భావించాం" అని చెప్పారు. ఈ వీడియోలో రక్తంతో తడిసిన ఓ సుత్తి కూడా కనిపిస్తోంది. కాగా, భర్త మరణించాడని తెలియగానే, కరణ్ భార్య తన ఐదేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ