యూపీలో జర్నలిస్టుపై దాడి...

June 15, 2015 | 12:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pilibhit_journalist_dragged_behind_motorbyke_100_mtrs_niharonline

జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతోంది. వారిపై దాడులకు ఒడిగడుతున్నారు. తమ అరాచకాలను బయటపెడుతున్న జర్నలిస్టులకు రక్షణ కరువవుతోంది. డబ్బు అధికార బలం అండచూసుకుని రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పిలిభిత్ జిల్లాలో ఓ జర్నలిస్టును పిలిచిమరీ దారుణంగా కొట్టారు. బైక్ కు తాడుతో కట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లారు. సినిమాల్లో లాగా రౌడీలు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదర్ ఖాన్ అనే విలేకరి సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆనంద్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఓ దొంగతనానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతడిని రక్షించేందుకు రావాలని ఫోన్ లో కోరాడు. దీంతో అతడు ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో నలుగురుకు పైగా అతడిపై దాడి చేసి కారులోంచి బయటకు లాగి.. బైక్ కట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలో ఇదే జిల్లాలో జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టుకు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ