ఓ తండ్రి ఆవేదన: తన కూతురి గతి ఎవరికీ పట్టొద్దని పోరాటం

February 05, 2015 | 11:06 AM | 61 Views
ప్రింట్ కామెంట్

ఫాదర్స్ డే రోజు ఆ కూతురు ఆ తండ్రికి ఓ గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. అందులో ‘‘నన్ను నేను రక్షించుకునేందుకు నాకు ఎలాంటి అద్బుత శక్తులు అవసరం లేదు. ఎందుకంటే నాకు మానాన్న ఉన్నాడు. ఆయన అండగా ఉండగా నాకు భయమెందుకు? అని ఉంది. అది చూసి ఆ తండ్రి ఉద్వేగానికి లోనయ్యాడు. అలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన కూతురు ఆయన కళ్లముందే ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా పడి ఉండటాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. అయితే కన్నీళ్లతో కాలం గడపకుండా తన కూతురికి పట్టిన గతి ఎవరికీ పట్టకూడదని డిసైడ్ అయ్యి పోరాటానికి దిగాడు. ఏకంగా కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ కి ఓ లేఖ రాశాడు. వివరాల్లోకి వెళ్లితే... కమలికా దాస్ అనే 17 ఏళ్ల యువతి కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది. నాలుగేళ్ల క్రితం అదే స్కూల్ లో చదువుతున్న ఓ సహచర విద్యార్థి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించడంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతన్ని స్కూల్ నుంచి పంపేశారు. అయితే ఆతర్వాత స్కూల్ యాజమాన్యం కమలికను వేధించడం ప్రారంభించింది. అనవసరంగా బాలుడిపై ఫిర్యాదు చేసి స్కూల్ కి చెడ్డపేరు తెచ్చావంటూ ఆమెను నిందించసాగారు. అంతేకాదు ఆమె క్యారెక్టర్ చెడ్డదని పేరు వేయటంతోపాటు, హోం వర్క్ సరిగ్గా చేయడం లేదనే సాకుతో ఆమెను స్కూల్ నుంచి పంపించేయాలని ప్రయత్నించారని చూశారట. దీంతో మానసికంగా కుంగిపోయిన కమలిక జనవరి 19న ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కమలిక మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కూతురి పరిస్థితి మరెవ్వరికి రాకూడదని కోరుతూ న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ కి లేఖ రాశాడు. దీనిపై స్పందించిన మంత్రి కమలిక తల్లిదండ్రులను కలిసి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ