వ్యాపం పాపంలో ఛాయ్ వాలానా?

January 11, 2016 | 12:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
CBI-summoned-to-tea-vendor-in-vyapam-niharonline

మధ్యప్రదేశ్ ను పట్టికుదిపేసిన వ్యాపం కుంభకోణంలో సీబీఐ పెద్ద షాకే ఇచ్చింది. అనుమానాస్పద స్థితిలో పదుల లెక్కల్లో మరణాలు సంభవిస్తున్నప్పటికీ దీనిలో విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న సంస్థ ఓ ఛాయ్ వాలాకు సమన్లు పంపి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కుంభకోణంలో గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (జీఎస్వీఎం) కాలేజీ విద్యార్థులపై దృష్టి సారించిన సీబీఐ కాన్పూరులోని లాలాలజపత్ రాయ్ ఆసుపత్రి ఎదుట టీ అమ్ముకుని జీవనం సాగిస్తున్న రాజుకు జనవరి 13న తమ ముందు హాజరుకావాలని సమన్లు పంపడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

అయితే తనకు ఎందుకు సమన్లు పంపారో అర్థం కావడం లేదని, తనకు వ్యాపం కుంభకోణం గురించి తెలియదని మీడియా ముందు వాపోయాడు. తానసలు మధ్యప్రదేశ్ కు కూడా వెళ్లలేదని ఆయన తెలిపారు. గత 20 ఏళ్లుగా అతను లాలాలజపత్ రాయ్ ఆసుపత్రి ఔట్ పేషంట్ విభాగం వద్ద టీ దుకాణం నడుపుకుంటున్నాడు. అతనికి సమన్లపై సీబీఐ కానీ, లోకల్ పోలీస్ కానీ పెదవి విప్పకపోవడం విశేషం. అయితే అతని వెనుక పెద్ద భాగోతమే ఉన్నట్లు సీబీఐ గట్టిగా నమ్ముతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ