జాతీయ గీతం జనగణమనకు తీవ్ర అవమానం ఎదురైంది. కనీస విద్యార్హత లేకపోయిన రాజ్యాంగానికి గౌరవమిచ్చే నేతలు ఉన్న ఈ కాలంలో ఆయనో రాష్ట్రానికి గవర్నర్ హోదాలో ఉండి విమర్శల పాలయ్యేలా వ్యవహారించారు. ఓ వైపు జనగణమన... అని జాతీయ గీతం వినిపిస్తుండగానే కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా వేదికను వీడి కిందకు దిగడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. మంగళవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాతీయ గీతం ప్రారంభమైంది. అయినప్పటికీ అదేం పట్టనట్టు వాజూభాయ్ వాలా మెట్లు దిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోసాగాడు. ఇక దీనిని గమనించిన అధికారులు ఆయనకు విషయం వివరించగా, తిరిగి వేదికపైకి వచ్చి నిలబడ్డారు. పలు టీవీ చానెళ్లు ఈ ద్రుశ్యాలను ప్రముఖంగా చూపాయి. ఓ వైపు రాజకీయ నేతలు, ప్రముఖులు నిలబడి జాతీయ గీతానికి గౌరవం ఇస్తుండగా, ఆయన వేదిక దిగి వెళ్లిపోవటంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా, మరో వైపు రాజ్ భవన్ కూడా ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన వెలువరించకపోవటం గమనార్హం.