సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జు వివాదం లేకుండా అస్సలు మాట్లడనే మాట్లాడరు. ఆ మధ్య సెక్సీయెస్ట్ ఉమెన్ కత్రినాకైఫ్ ను దేశానికి రాష్ట్రపతి చేయాలని, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షాజియా ఇల్మీ ని ప్రకటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించిన ఈ పెద్దాయన ఇప్పుడు ఏకంగా గాంధీపై పడ్డాడు. వాట్ ఈజ్ ఇండియా? పేరుతో తన బ్లాగులో రాసిన ఓ ఆర్టికల్ లో మహాత్ముడిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మహత్మా గాంధీ ఓ బ్రిటీష్ ఏజెంటు’ అని ఆయన పేర్కొన్నారు. ఇలా ఆనటం వల్ల నాపై చాలా దూషణలు వస్తాయని నాకు తెలుసు. కానీ, ప్రజాదరణ ఆశించని ఓ వ్యక్తిని కాబట్టి పెద్ద విషయం కాదు. ఎవరేమనుకన్నా నా దేశ ఆసక్తి మేరకు కొన్ని విషయాలు చెబుతాను అంటూ మొదలెట్టి వ్యాసాన్ని ప్రచురించాడు. నేనిలా అనడానికి కారణాలు ఇవే అంటూ కారణాలు పేర్కొన్నాడు. భారతదేశంలో అద్భుతమైన వైవిధ్యం ఉంది. చాలా మతాలు, కులాలు, జాతులు, భాషలు వగైరా ఉన్నాయి అని చెప్పారు. విభజించు పాలించు అనేది బ్రిటీష్ వారి విధానమన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ, రాను రాను గాంధీ దాన్ని మరింత విస్తరించి మనుషుల మధ్య చిచ్చు రేపారు అంటూ ఆరోపించారు. ఇలా ఆయన బ్రిటీష్ వారికి ఏజెంట్ గా పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్రద్యోమంలో ముఖ్య భూమిక పోషించిన ఓ మహానుభావుడిని ఇలా నిందిస్తూ మాట్లడటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. మాజీ న్యాయమూర్తిగారికి మరీ ఇంత నోటి దూల పనికి రాదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.