అమ్మాయిలతో కలిసి కూర్చుంటే తప్పా?

November 04, 2015 | 05:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
farook-college-suspended-student-niharonline

యువతీ యువకులు స్నేహం పేరిట కలిసి తిరుగుతున్నా లైట్ తీస్కుని పట్టించుకోని రోజులివి. అలాంటిది తరగతి గదిలో అమ్మాయిలతో కలిసి కూర్చున్నాడని ఓ విద్యార్థిని సస్పెండ్ చేసిన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఈ ఘటన విద్యాధికులు అత్యధికంగా ఉండే కేరళలో వెలుగు చూడటం విశేషం.

కోజికోడ్ లోని ఫరూఖ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు తమ తరగతి గదిలో విద్యార్థినుల పక్కన కూర్చున్నారు. దీంతో కళాశాల నిబంధనలు అతిక్రమించారని సూచిస్తూ ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం వివరణ కోరింది. విద్యార్థులంతా క్షమాపణ పత్రం రాసి, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతామని కళాశాల యాజమాన్యానికి ఇచ్చారు. అయితే ఒక విద్యార్థి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఆ విద్యార్థిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోవడంతో తనను సస్పెండ్ చేశారని ఆ విద్యార్థి తెలిపాడు. తమ కళాశాలలో విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా బెంచీలు ఉన్నాయని, క్యాంటీన్ లో కూడా వేర్వేరు బెంచీలు ఉన్నాయని ఆ యువకుడు తెలిపాడు. కాగా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ