సీపీఎం మహిళా విభాగం కార్యకర్తలపై తృణముల్ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ల జాకెట్లు వాళ్లే చించుకుంటారు. నానా గొడవ చేస్తారు. అవతలి వాళ్లపై లైంగికదాడుల పేరిట తప్పుడు కేసులు పెడతారు’ అంటూ మంత్రి స్వపన్ దేవ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈయన మమతా బెనర్జీ హయాంలో చిన్నపరిశ్రమలు, వస్త్ర శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. స్వపన్ బర్దాన్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... విపక్షంలోని చాలా మంది మహిళా కార్యకర్తలు అధికారపక్షం మీద కేసులు పెట్టడానికి తమ దుస్తులు తామే చించుకుంటన్నారని అన్నారు. ఇంట్లో భర్తతో గొడవపడి దెబ్బలు తిన్నా కూడా బయటికి వచ్చి తృణముల్ నేతల మీద అత్యాచార, వేధింపుల కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.