సల్లూ భాయ్ కి కాస్త ఊరట

January 14, 2015 | 11:28 AM | 29 Views
ప్రింట్ కామెంట్

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాత్కాలిక ఊరటను కలిగించినట్టే కలిగించి ఆపై ఓ చిన్న ఝలక్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. శిక్ష అమలుపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు కేసును మరోసారి విచారించాలని ఆదేశించింది. అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు గల అనుమతులన్నింటినీ రద్దుచేసింది. కాగా, 1988 నాటి కేసులో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు 5ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. అయితే కేసులో శిక్ష అమలును నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ ముగించిన అత్యున్నత న్యాయస్థానం పునర్విచారణకు ఆదేశించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ