‘సైనెడ్’ మల్లిక ఎవరసలు?

December 19, 2015 | 05:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
cyanide-mallika_life-imprisonment-niharonline

నేరప్రవృత్తిలో కొత్త కొత్త ట్రిక్కులు వాడి జనాలను దోచుకోవటంలో మగాళ్లకు తీసిపోకుండా తయారయ్యారు మహిళలు. అవసరమైతే తెగించి హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా అలాంటి మహిళ ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఒక మహిళ అయి ఉండి సైనడ్ తో ఏకంగా 16 హత్యలు చేసి సంచలనం రేపింది.  కే డీ కెంపమ్మ అలియాస్ సైనెడ్ మల్లిక కర్నాటక లోని మద్దూరు ప్రాంతంలోని ఆలయాల పరిసరాల్లో తిరుగుతూ ఒంటరి మహిళలతో దోస్తీ చేసుకునేది. డబ్బున్నవారికి మంచిరోజులు రావాలంటే పూజలు చేయాలని చెప్పేది. పూజ సమయంలో నగలు తప్పనిసరిగా ధరించాలని, పూజ కుడా ఒక ప్రత్యేక ప్రదేశంలో చేయాలని సలహాలిచ్చేది. నమ్మకం ఏర్పడిన తర్వాత వారికి ఆహార పదార్థాలల్లో సైనేడ్ కలిపి ఇచ్చి, హత్య చేసి సదరు మహిళల బంగారాన్ని దోచుకునేది.
                          ఈ క్రమంలోనే 2007లో బెంగళూరుకు చెందిన విదేశీ మహిళ ఎలిజిబెత జోసఫ్ ను పరిచయం చేసుకుని కనకపుర తాలూకా కబ్బాళమ్మ ఆలయంలో పూజలు జరిపించేందుకు వచ్చానని చెప్పి ఆమె గదిలోనే ఓ రాత్రి మల్లిక నిద్రించింది. ఆ రాత్రి ప్రసాదం పేరుతో సైనేడ్ కలిపిన పదార్థాలను ఇచ్చింది. దాంతో ఎలిజిబెత చనిపోయింది. ఆ వెంటనే ఆమె నుంచి బంగారు ఆభరణాలను దోచుకుని మల్లిక పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు మల్లికను అరెస్టు చేశారు. అనంతరం జరిగిన విచారణలో 'సైనేడ్' మల్లిక తరచూ పేర్లు మార్చుకుని మహిళలను హత్యచేసి దోపిడీలకు పాల్పడినట్టు తేలింది. దీంతో ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మల్లికకు జీవితకాల శిక్ష విధిస్తున్నట్టు కనకపుర రెండవ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. మల్లిక కు సావిత్రమ్మ, లక్ష్మి, జయమ్మ లాంటి మారుపేర్లు వున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ