మ్యాగీకి మళ్లీ మూడుతోంది

December 16, 2015 | 03:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
supreme-court-maggi-re-lab-test-niharonline

చాలా రోజుల నిషేధం తర్వాత మ్యాగీ నూడుల్స్ మళ్లీ మార్కెట్ లోకి వస్తున్న తరుణంలో నెస్లే కంపెనీకి అత్యున్నత న్యాయస్థానం మరో షాక్ ఇచ్చింది. మ్యాగీ నూడుల్స్ కి మరోసారి ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మైసూర్ ల్యాబరేటరీలో పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. వినియోగదారుల పానెల్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఎన్సీఆర్డీ (నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్) 16 మ్యాగీ శాంపిల్స్ ని పరీక్షల కోసం పంపింది. ఐదు నెలల తరువాత బాంబే హైకోర్టు తీర్పుతో మ్యాగీ గత నెల నుంచి కొత్తగా ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ లోకి కూడా నూడుల్స్ వచ్చేశాయి. భారీగా ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఏ మాత్రం తేడా కొట్టినా పెద్ద మొత్తంలో సంస్థకు నష్టం వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ