జబల్పూర్-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో దొపిడీ దొంగలు రెచ్చిపోయారు. తుపాకులతో ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో కోసి కలాన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇక్కడో చిత్రం చోటుచేసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి జయంత్ మలయ్యా, ఆయన భార్య సుధ కూడా దొపిడీకి గురయ్యారు. ఈ ఘటనను మంత్రి భార్య సుధ కూడా నిర్థారించారు. దీనిపై ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు. ప్రతి రైలులోనూ పోలీసులను ఏర్పాటుచేయటం సాధ్యం కాదంటూనే ఓ వైపు ఇలాంటివి రీపిట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వెలిబుచ్చారు. దీనిపై రైల్వే శాఖ ఎంక్వైరీకి ఆదేశించింది. నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ముగ్గురు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిత్యం భద్రతా నడుమ ఉండే మంత్రులకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని మరోవైపు విమర్శలు వినవస్తున్నాయి.