అతడు... అనుష్క... మధ్యలో ఆమె?

March 18, 2015 | 02:52 PM | 88 Views
ప్రింట్ కామెంట్
Rakhi_sawant_Virat_kohli_niharonline

భారత్ యువ క్రికెటర్, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. తన ఆటతోపాటు స్టైల్ తో కూడా ఈ యువ క్రికెటర్ యూత్ మనస్సును దొచేసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ నటి అనుష్క శర్మ తో ప్రేమాయణం కొనసాగిస్తూ... చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరి నోళ్లలో నానుతున్నాడు. అయితే ఈ జంటకు ఎవరి దిష్టి సోకిందో తెలీదుకనీ కొత్త చిక్కు వచ్చిపడింది. అదేటంటే ఈ క్రేజీ క్రికెటర్ పై బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ మనసుపారేసుకుందట. ఉత్త మనసు పారేసుకోవడమే కాదు... ఏకంగా ‘ఐ లవ్ యు విరాట్ కోహ్లీ’ అంటూ బహిరంగంగా ప్రకటించింది. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, "విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. అతనిని ప్రేమిస్తున్నట్టు అనుష్క ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. కానీ నేను విరాట్‌ను ప్రేమిస్తున్నట్టు బహిరంగంగా చెప్పా!"అని రాఖీ తెలిపింది. మరీ ఈ ప్రపోజల్ పై విరాట్ ఏమంటాడో? అనుష్క ఎలా స్పందిస్తుందో? వెయిట్ అండ్ సీ...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ