శారదా స్కాంలో మాజీ మంత్రికి సీబీఐకి సమన్లు

January 12, 2015 | 03:29 PM | 30 Views
ప్రింట్ కామెంట్

శారదా చిట్ ఫండ్ స్కాం విచారణలో భాగంగా తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కి సీబీఐ దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. ఇఫ్పటికే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మదన్ మిత్ర, ఎంపీలు కునాల్ ఘోష్, శ్రీంజోయ్ బోస్ లు, తృణముల్ వైస్ ప్రెసిడెంట్ రాజత్ మజుందార్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. మరికొంత మంది నేతలు విచారణను ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు ఇదే వరుసలో గతంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పని చేసిన ముకుల్ రాయ్ కి ిచారణు హాజరు కావాల్సిందిగా నోటీసు జారీచేసింది. కాగా, ఈ కుంభకోణంలో విచారణ పేరిట సీబీఐ టీఎంసీ నేతలను మానసిక క్షోభకు గురిచేస్తోందని, కేంద్రం కూడా సీబీఐ ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించింది, తద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని కేంద్రం చూస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఓ పిటిషన్ ను దాఖలు చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ