ఆశారాం కేసులో కీలక సాక్షి హత్య

January 12, 2015 | 12:18 PM | 37 Views
ప్రింట్ కామెంట్

లైంగికదాడి ఆరోపణలతో జైలులో ఉన్న ఆశారాం బాపు కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక సాక్షిగా ఉన్న వంట మనిషి అఖిల్ గుప్తా(35) దారుణ హత్యకు గురయ్యాడు. ముజఫర్ నగర్ లోని జన్సత్ రోడ్డుపై గుప్తాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం ఆయన ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. కాల్పులకు గురైన గుప్తాను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆశారాం బాపూకు గుప్తా అంతరంగికుడు. మైనర్ పై లైంగిక దాడి కేసుకు సంబంధించి గుప్తా స్టేట్ మెంటును గాంధీనగర్ కోర్టు రికార్డు చేసింది. విచారణ పూర్తి కాకుండానే కీలక సాక్షి హతం కావటంతో కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ