సాధారణంగా అమ్మాయి పుడితే బాధపడటం, అబ్బాయి పుడితే సంబరాలు చేసుకోవటం మనదేశంలో కనిపించే విషయం. కానీ, మధ్యప్రదేశ్ లోని ఓ తెగవారు మాత్రం అబ్బాయి పుడితే కుమిలిపోతారట. అదేంటి అనుకుంటున్నారా. అయితే అక్కడ ఓ లుక్కేద్దాం పదండి. మధ్యప్రదేశ్ లోని నోమదిక్ తెగలో మగపిల్లాడు పుడితే దిగులుపడతారు. అదే అమ్మాయిలు పుడితే సంబరాలే... సంబరాలు. కారణం ఏంటనుకుంటున్నారా? ఆ తెగ ప్రధాన వ్రుత్తి వ్యభిచారం కావటమే. రోడ్ల పక్కన గుడారాల్లో నివసించే వీరు ఎంత ఎక్కువ ఆడసంతానం కలిగితే అంత మంచిదని అనుకుంటారట. ఒకవేళ గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే అబార్షన్లకు సిద్ధపడతారట. ఒకవేళ ఆడసంతానం లేకపోతే, దత్తత తీసుకోవటమో, లేక కొనుగొలు చేసో తెచ్చుకుంటారట. అయితే రానురాను వారిలో మార్పు వస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు. వారు చేసే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి అమ్మాయిలను చదివిస్తున్నారట. వారిలో మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించే వారు కూడా ఉన్నారండోయ్.