వీళ్లిక మారరు: నోరు జారిన మరో బీజేపీ ఎంపీ

February 09, 2015 | 02:16 PM | 58 Views
ప్రింట్ కామెంట్
yogi_adityanath_controversy_over_religion_niharonline

ఎన్ని వార్నింగులు, రిక్వెస్ట్ లు చేస్తున్న బీజేపీ ఎంపీలు నొటిని అదుపు చేసుకోవటం కష్టమంటున్నారు. తాజాగా మరో ఎంపీ యోగి ఆదిత్యానాథ్ మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశమిస్తే ప్రతి మసీదులో గౌరి-గణేశుడి విగ్రహాలను ప్రతిష్టిస్తానని ఆయన అన్నారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళన్ లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. హిందుస్థాన్ లో అందరినీ హిందువులను చేస్తానని ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ కాశీ రావొచ్చునని... కానీ, మక్కా, మదీనాలో మాత్రం కేవలం ముస్లింలనే అనుమతిస్తారని పేర్కొన్నారు. భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇది హిందుత్వ శతాబ్దమని యోగి అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ