బూతులు తిట్టేంతగా ఆ యాంకర్ ఏంచేసింది?

March 01, 2016 | 03:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
anchor-sindhusooryakumar-phone-calls-niharonline

టీవీషో లో నోరు జారిన పాపానికి ఆ యాంకరమ్మపై తిట్ల దండకాలు పడ్డాయి. అలా ఇలా కాదు ఆమె పర్సనల్ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మరీ బండ బూతులు తిట్టారు. ఇంతకీ ఆ యాంకరమ్మ చేసిన పాపం ఏంటీ? కేరళ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు. మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించింది. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు.

అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు విసిగిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా తాను అభివర్ణించలేదని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ