ముస్లిం యువతి కేసు పెద్ద చిక్కుప్రశ్నే!

March 01, 2016 | 12:59 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Supreme Court notice to Centre on triple talaq niharonline

మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం వెనుకంజ వేసిన సందర్భాలు అనేకం. అలాంటిది ముస్లిం వ్యక్తిగత చట్టాలకు సంబంధించి అంశాలు అంటే మరీను. అయితే ఆ మతానికి చెందిన ఓ యువతి సుప్రీంకు ఎదురు ప్రశ్న వేస్తుంది. ఇస్లాం పర్సనల్ లోని చట్టాలు ఎంతమాత్రమూ సమంజసం కావని, అవి భారత రాజ్యాంగ విరుద్ధమని షాయారా బానూ అనే యువతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఏం చేయాలో సూచించమని సర్కారును ప్రశ్నించింది.

ముస్లిం మతంలో అమలవుతున్న 'తలాక్- ఏ-బిదత్' (మూడుసార్లు తలాక్ అంటే విడాకులు), నిఖా హలలా, బహుభార్యత్వం తదితరాలు రాజ్యాగంలోని 14, 15, 21 ఆర్టికల్స్ ఉల్లంఘనేనని షాయారా ఆరోపించింది. తన భర్త చేస్తున్న గృహ హింసను ప్రశ్నించినందుకు తనకు మూడుసార్లు 'తలాక్' అని చెప్పి విడాకులు ఇచ్చేసినట్టు ప్రకటించాడని, ఇదెలా కుదురుతుందని ఆమె సుప్రీంకోర్టును ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిల్ ఆర్ దావే, ఏకే గోయల్ లతో కూడిన ధర్మాసనం, మత విశ్వాసాలతో కూడుకున్న ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై కేంద్రాన్ని కల్పించుకోవాలని కోరింది.

ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో చట్టాలు మారాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను" అని ఈ సందర్భంగా షాయారా వ్యాఖ్యానించింది. కాగా, పవిత్ర ఖురాన్ లో ఎక్కడా 'తలాక్-ఏ-బిదత్' ప్రస్తావన లేదని ఇప్పటికే ఎందరో రీసెర్చ్ స్కాలర్లు తమ పరిశోధనల ద్వారా చెప్పారు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ