రేపటి నుంచి మీ పాస్ పోర్టులు చెల్లవు!

November 24, 2015 | 12:11 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Manual_passports_no_longer_valid_in_india

విదేశీ ప్రయాణాలకు సిద్ధమౌతున్నారా? అయితే ఓసారి మీ పాస్ పోర్ట్ చెక్ చేసుకోండి. లేకపోతే మీకు సమస్యలు తప్పవు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ (ఐసీఏఓ) నిబంధనల ప్రకారం చేత్తో రాసిన పాస్ పోర్ట్ లు రేపటి నుంచి అంటే నవంబర్ 25 నుంచి చెల్లవట. ఈమేరకు విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. చేతితో రాసినదైతే వెంటనే మార్చుకోండి. లేకుంటే ఆ పాస్ పోర్టు ఉపయోగపడదని ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా పాస్ పోర్టు రెన్యువల్ కాలపరిమితి 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ, నిబంధనల కారణంగా ఇప్పుడున్న టెక్నాలజీని అనుసరిస్తూ ప్రింటెడ్ పాస్ పోర్ట్ అయితేనే చెల్లుబాటు అయ్యేలా చూడాలని భావిస్తున్నారట.

ప్రపంచ వ్యాప్తంగా ఒకే తరహా పాస్ పోర్టులు వాడడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని ప్రకారం ఐసీఏఓ సభ్య దేశ పౌరులు యంత్రాలు మాత్రమే గుర్తించగల పాస్ పోర్టులు వాడాలి. నిజానికి భారత దేశంలో 2005 కు ముందు కొన్ని లక్షల పాస్ పోర్టులు లిఖితంగా జారీ చేశారు. అయితే అవి కాలపరిమితి పూర్తి అయి కొత్త విధానంలో రెన్యూవల్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. నిజానికి సంవత్సరం క్రితమే దీనిపై హెచ్చరించింది కూడా. కాల పరిమితి ముగియడానికి సంవత్సరం ముందుగానే రెన్యువల్ చేయించుకోవడం మంచిదని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక హైదరాబాద్ లో సుమారు ఏబై వేల వరకు చేతి రాతతో జారీ చేసిన పాస్ పోర్టులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తరహా పాస్ పోర్టులను కలిగివున్న వారు కొత్త పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేస్తే వెంటనే జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. కనుక ఒక్కసారి మీ పాస్ పోర్టులను తనిఖీ చేసుకుంటే బెటర్. అంటే, ఇప్పటికీ ఇండియాలో ఈ తరహా పాస్ పోర్టులు ఉన్నాయన్న మాట. వీటన్నింటినీ తక్షణం మార్చుకోకుంటే, విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతారన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ