ఇండియన్ రిచ్చెస్ట్ బెగ్గర్ భరత్

October 12, 2015 | 02:47 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Richest-Indian-Beggar-Bharat-Jain-niharonline

అతనో బిచ్చగాడు.. అయితే ఏంటంటారా? మరీ అంతలా తీసిపారేయకండి. అతగాడి గురించి తెలిసి మీరు గుండెల మీద చెయ్యి వేసుకోవాల్సిందే. రోజు అతగాడి సంపాదన ఎంతో తెలుసా? మూడు వేలు పైనే. అన్ని కలుపుకుని నెలకు ఎంతో తెలుసా? అక్షరాల 75,000. షాక్ అవ్వకండి. దాదాపు ముప్పై ఏళ్లుగా ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ ఉంటున్నాడు. అంటే థర్టీ ఇయర్స్ ఇన్ దట్ ఇండస్ట్రీ అన్న మాట. అతగాడి పేరు భరత్ జైన్. వయస్సు 49 ఏళ్లు. ఇండియాలో అత్యంత సంపన్న బిచ్చగాడు ఇతడే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. మరోవైపు ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇళ్లు సంపాదించటం కష్టమైన ఈరోజుల్లో ఇతగాడికి 80లక్షలు విలువ చేసే రెండు ఫ్లాట్ లు, పది వేలు ఆదాయం వచ్చే ఓ షాపు ఉన్నాయట. అంత కాస్ట్లీ ఫ్లాట్ ఉన్నప్పటికీ వాటిని  అద్దెకు ఇచ్చేసిన భారత్ జైన్ అనే ఈ బిచ్చగాడు కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

ఇక షాపును కూడా జ్యూస్ సెంటర్ కి అద్దెకిచ్చేశాడు. అలాగే అతని కుటుంబంలో మిగిన సభ్యులు స్కూళ్ళకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ సరఫరా చేసే వ్యాపారంలో బిజీగా ఉన్నారట. అయితే మన రిచ్ బిచ్చగాడు భరత్ జైన్ మాత్రం తనకు ఎంతగానో కలిసి వచ్చిన యాచక వృత్తిని మాత్రం పక్కన పెట్టకుండా రోజుకు ఏడెనిమిది గంటల పాటు రద్దీ కూడళ్ళలో తిరుగుతూ రోజుకు రెండుమూడు వేల రూపాయల వరకు అవలీలగా సంపాదించేస్తున్నాడు. బిజినెస్ బాగుందని బంగారు బొచ్చెలో కూడా అడుక్కోవటం లేదట. ముప్పై ఏళ్లుగా తనకు అచ్చొచ్చిన అదే ప్లేట్ లోనే ధర్మం స్వీకరిస్తున్నాడట భరత్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ