కారుణ్య మరణాలకు క్లియరెన్స్ ఇస్తారా?

February 16, 2016 | 12:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
India-Mercy-Killing-central-govt-supreme-cort-niharonline

కోలుకునే అవకాశం లేక చావుబతుకుల మధ్య మరణశయ్యపై జీవచ్ఛవంలా పడిఉన్నవారికి విముక్తి కలిగించే కారుణ్య మరణాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అరబ్ లాంటి కొన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీవితాంతం మంచంపైనే నరకాన్ని అనుభవించలేక బాధపడుతున్నవారు మరణంతోపాటు తమ దేహంలోని కీలక అవయవాలను దానం చేసిన ఘటనలను ఎన్నో చూశాం. ఇక భారత్ విషయానికొస్తే ఈ విషయమై సాగుతున్న చర్చలో సుప్రీంకోర్టు చేతులెత్తేసింది. తాము ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేమని, ప్రజా కోర్టులోనే చర్చించి ఓ నిర్ణయానికి రావాలని కోరుతూ బంతిని పార్లమెంట్ పరిధిలోకి నెట్టింది.

                                   ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షూమాకర్ ఇదే పరిస్థితుల్లో ఉన్నాడని, ఆయన తిరిగి కోలుకుంటాడన్న ఉద్దేశంతో సంవత్సరాలుగా బతికించుకుంటూ వస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ నిర్ణయానికి వెంటనే రాలేమని అభిప్రాయపడ్డ జస్టిస్ అనిల్ ఆర్. దావే నేతృత్వంలోని ధర్మాసనం, ప్రజా ప్రతినిధులు చర్చించి ఓ నిర్ణయానికి వస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఇదో సంక్లిష్టమైన సమస్యని, పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ