తప్పిపోయిన తల్లీ, కూతుర్లను కలిపిన వాట్సాప్

October 20, 2015 | 10:46 AM | 8 Views
ప్రింట్ కామెంట్
mother_loves_child_with-whatsaap.jpg

వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఓ సంఘటన అందరిని ఆకట్టుకుంది. తప్పి పోయిన బిడ్డను తల్లి ఒడికి చేర్చింది. పోలీసులో లేదా స్థానికులో కాదండోయ్. నేటి సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్.

కేసముద్రంలో నివాసముంటున్న సునీత అనే మహిళ తన రెండేళ్ల కూతురు రచనతో కలిసి షాపింగ్ కి వెళ్లింది. బిడ్డకోసం బట్టలు సెలక్ట్ చేసే క్రమంలో బిడ్డను కాస్త నిర్లక్షం చేసింది అంతే. అటూ-ఇటూ చూస్తూ, ఆడుకుంటూ దగ్గర్లోని రైల్వే స్టేషన్ వరకు నుడుస్తూ వెళ్లిందీ చిన్నారి సిసింద్రి.

అక్కడి వరకు వెళ్ళిన పాపకు తల్లి కనిపించకపోవడంతో ఏడ్వడం ప్రారంభించింది. అక్కడే ఉన్న ఒక ఆటో డ్రైవర్ పాప తలిదండ్రుల కోసం ఆరా తీయగా ఎవరూ ముందుకు రాలేదు. మరి షాపు వద్ద తల్లి పాప కోసం గాలించడం అందరిని కలచివేసింది.

ఆటో డ్రైవర్ పాప కోసం విచారించడం చూసిన ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో పాప ఫోటో తీసి విషయాన్ని వివరిస్తూ, వాట్సాప్ లోని అన్ని కాంటాక్ట్ నంబర్లకూ పంపాడు. ఇంకేం నిమిషాల్లోనే కేసముద్రంలోని అన్ని స్మార్ట్ ఫోన్లకూ వైరల్ అయింది.

బట్టల షాపు ఎదురుగా ఉన్న హోటల్ యజమాని వాట్సాప్ లో పాప ఫోటో చూసి తన తల్లి బిడ్డ కోసం ఏడుస్తుండడం చూసి తన దగ్గరికి వచ్చి ఫోటోను చూపించాడు.

ఫోటో చూసిన తల్లి ఆ పాప నా పాపే అంటూ ఆనందంతో మునిగిపోయింది. కాసెప్పట్లోనే తల్లి ఒడికి బిడ్డ సురక్షితంగా చేరింది. తల్లీ కూతుర్లను కలిపిన వాట్సాప్ కి మన హాట్సాప్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ