అదే జరిగితే ముంబై, కోల్ కతాలు జలసమాధి

November 10, 2015 | 12:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mumbai, Kolkata among top 10 megacities under threat from rising sea levels

వాతావరణంలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం వల్ల భూమిపై వేడీ రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో దృవప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటిక్ మంచు క్రమంగా కరుగిపోయి సముద్ర మట్టాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈకారణంగా ఇప్పటికే పలు చిన్నచిన్న దీవులు, తీర ప్రాంతాలు కనుమరుగైపోగా, మరో కొన్ని నీట మునిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాకు చెందిన క్లైమెట్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అంతులేని వాతావరణ కాలుష్యం, విపరీతంగా అడవులను నాశనం చేయటం వల్ల ప్రపంచానికి తీవ్ర ముప్పు ఎదురుకానుందని చెబుతోంది. ఇదే కొనసాగి భూతాపం మరో 4 డిగ్రీలు పెరిగితే ప్రపంచంలోని ఓ పది నగరాలు నీట మునిగిపోతాయట. తద్వారా ఎవరూ ఊహించలేని రీతిలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా చైనా దీనిద్వారా ఎక్కువ నష్టపోతుందని తెలుస్తోంది. దాదాపు 145 మిలియన్ జనాభా పై దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఇక చైనాతోసహా మరో 12 దేశాల నగరాలు దీనిద్వారా తీవ్ర నష్టం చవిచూస్తాయట. ఈ జాబితాలో టాప్ టెన్ లో భారత్ కు సంబంధించి ముంబై, కోల్ కతా నగరాలు ఉన్నాయి. ఇక భారత్ లో 4 డిగ్రీలు గనుక పెరిగనట్లయితే ఆ రెండు నగరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. తద్వారా  55 మిలియన్ల జనాభా రోడ్డున పడనుంది. ఒకవేళ అది హఠాత్తుగా జరిగితే ప్రాణనష్టం కూడా విపరీతంగా జరిగే అవకాశం ఉందట. అదే ఉష్ణోగ్రత గనుక 2 డిగ్రీలు పెరిగితే 20 మిలియన్ జనాభా పై ప్రభావం పడనుంది.  దీనిద్వారా ముప్పు స్థాయి కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ హెచ్చరికల నేపథ్యంలో  విపత్తుపై ఈనెల 30న పారిస్ లో 80 దేశాల ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి చర్చించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ