మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు జీవించండి. మీరు ధైర్యంతో చేసే ఆపనులే మిమల్ని జీవితంలో ముందుకు నడిపిస్తాయి. ఇదే సూత్రాన్ని పాటించి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకున్నాడు ఆ వ్యక్తి. అతనో బార్బర్ అయితేనేం 200 కార్ల ఓనర్. ఇందులో బీఎంబ్ల్యూ, రోల్స్ రాయిస్, బెంజ్, రేంజ్ రోవర్ వంటి అత్యంత విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారికి సైతం అత్యంత విలాసవంతమైన కార్లు అద్దెకిస్తుంటాడు. నమ్మడం లేదా? అయితే ఇది చదవండి.
కర్ణాటకకు చెందిన రమేష్ వృత్తిరీత్యా బార్బర్...చేసేది జట్టు గొరగం అయినా, కాస్త విలాసవంతమైన సింగపూర్ కటింగ్ కి ఫేమస్. పలువురు వీఐపీలు ఆయన దగ్గరే క్షవరం చేయించుకుంటారు. పుట్టుకతో అతడు ఒక బార్బర్ కొడుకు చిన్న తనంలోనే తండ్రి చనిపోయాడు. ఆర్ధిక సమస్యలతో అతని తల్లి చాలామంది ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేసింది. చిన్న తనం నుండి ఆర్ధిక సమస్యలతో పెరిగిన ఆ వ్యక్తికి తన తండ్రిలా బార్బర్ గా జీవితం గడపడం ఇష్టం లేదు. కానీ పెద్ద చదువులు చదువుకోక పోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయం. దాంతో బార్బర్ వృత్తినే కొనసాగించాడు. అయితే ఎలాగోలా 1994లో కేవలం కొద్ది పాటి మొత్తంతో ఓ మారుతి వ్యాన్ కొన్నాడు. అది నిరుపయోగంగా పడి ఉండటం ఎందుకని కార్ రెంటల్ బిజినెస్ మొదలు పెట్టాడు. మొదట్లో ఆ బిజినెస్ సరిగ్గా నడవక పోవడంతో నానాపాట్లు పడ్డాడు. అయినా తన పట్టుదల వీడలేదు అనుకోకుండా అవకాశాలు కలిసి రావడంతో సెకండ్‌హ్యాండ్ మారుతీ వ్యాన్ తో మొదలు పెట్టిన అతని కార్ రెంటల్ బిజినెస్ లో తోపును చేసింది.
ఇప్పుడు అతని దగ్గర మొత్తం 200 కార్లు ఉన్నాయి. అందులో 75 లగ్జరీ కార్లు. తన దగ్గరున్న బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ లాంటి కార్లను బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా అద్దెకు తీసుకెళ్తాడని రమేష్ చెబుతున్నాడు. కష్టపడండి. నిజాయితీగా ఉండండి. దానికి అదృష్టం కూడా తోడైతే మీరూ హీరోలే అంటున్నాడు.