ప్రేమోన్మాది నడిరోడ్డుపై నరికి చంపాడు

March 26, 2016 | 03:25 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vollyball-player-girl-killed-in-westbengal-niharonline

నిజమైన ప్రేమకి ఓర్పు, సహనం ఉండాలి. అప్పుడే అది నిజ‌మైన ప్రేమ. కానీ ప్రేమ అనే పేరుతో ఆక‌ర్ష‌ణ మోజులో దారుణాలకు ఒడిగ‌డుతున్నారు నేటియువ‌త‌. నిండా 18ఏళ్లు కూడా నిండ‌ని ఓ యువ‌కుడు తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో 14ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు. జ‌నం మ‌ధ్యలోనే నడిరోడ్డుపై బాలికను వెంటాడి నరికి చంపేశాడు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ దారుణం జ‌రిగింది.

                             వాలీబాల్ ప్లేయ‌ర్ అయిన‌ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చ‌దువుతోన్న సంగీతా ఎయిచ్. మూడుసార్లు జాతీయ స్థాయి మ్యాచ్ ల్లో, నాలుగు సార్లు స్టేట్ లెవెల్లో ఆమె మ్యాచ్ లు ఆడింది. శుక్రవారం వాలీబాల్ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఓ 18ఏళ్ల యువకుడు అక్కడికి వచ్చి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇందుకు బాలిక నిరాకరించడంతో తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆమెపై దాడికి యత్నించాడు. దీంతో ఆ బాలిక‌ పారిపోయేందుకు ప్రయత్నించి రోడ్డుపైకి ప‌రిగెత్తింది. బాలిక‌ను వెంబ‌డించిన ఆ ఉన్మాది న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే గొడ్డలితో నరికి పరారయ్యాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అనంతరం ఉన్మాది పోలీసుల‌కి లొంగిపోయాడు. అయితే సదరు నిందితుడు చాలా రోజులుగా తమ అమ్మాయిని వేధిస్తున్నాడని ఎయిచ్ తల్లిదండ్రులు చెబుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ