నాడు అడ్డుకున్నవాడే... నేడు అమలు చేస్తున్నాడు

May 27, 2015 | 11:25 AM | 35 Views
ప్రింట్ కామెంట్
varanasi_collector_pranjal_yadav_modi_niharonline

పనిలో సిన్సియారిటీని కనబరిస్తే కచ్ఛితంగా గుర్తింపు ఉంటుందనడానికి ఇక్కడో అధికారి ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. డ్యూటీ కరెక్ట్ గా నిర్వహించిన ఓ అధికారికి స్వయంగా ప్రధాని మోదీ యే ప్రాముఖ్యత ఇవ్వటం ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. దాదాపు సంవత్సరం క్రితం నేటి ప్రధాని, నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ వారణాసి లో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాడు. అయితే దానికి ఆ జిల్లా కలెక్టర్ ప్రాంజల్ యాదవ్ అనుమతి నిరాకరించాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా మోదీ ర్యాలీకి అనుమతించేది లేదని ఆయన ఖరాకండిగా చెప్పటంతో బీజేపీ తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపింది. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం వారణాసి నగరాన్ని మోదీ ప్రణాళికల మేరకు అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రాంజల్ పరుగులు పెడుతున్నారు. ఆనాటి ఘటనను ప్రాంజల్ కు గుర్తు చేస్తే, ప్రధానితో తాను ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నాను. ఏనాడూ తమ మధ్య ఆ విషయం ప్రస్తావనకు రాలేదని తెలిపాడు. ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఖర్చు చేయాల్సిన రూ.5 కోట్ల ఎంపీ లాడ్స్ నిధుల వ్యవహారాలనూ కూడా మోదీ తనకే అప్పగించాడని చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ప్రాంజల్ ను తొలగించాలని పార్టీ చీఫ్ అమిత్ షా సహా బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయట. కానీ, అతని సిన్సీయారిటీకి మెచ్చి మోదీ అతన్నే కంటిన్యూ చేయటమే కాదు, కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు నియమించాడట. ప్రస్తుతం ప్రాంజల్ మోదీ నిర్ణయాలను అమలు చేసే పనిలో పుల్ బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ