నిజమా? నేతాజీ నియంతృత్వ పాలన కోరుకున్నాడా!

April 20, 2015 | 02:47 PM | 43 Views
ప్రింట్ కామెంట్
nethaji_on_nehru_rule_after_independence_niharonline

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా ముందుకు సాగాలంటే స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కనీసం 20 సంవత్సరాలపాటు ఇండియాలో నియంతృత్వ పాలన కొనసాగాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావించినట్లు తెలుస్తోంది. అందువల్లే తొలి ప్రధాని పదవి కాంక్షతో దీర్ఘకాలం పాటు ఆయనపై నిఘాను కొనసాగించి ఉండవచ్చని సమాచారం. 1935 లో లండన్ లో నేతాజీ రాసిన పుస్తకం ‘ఇండియన్ స్ట్రగుల్’ పేరిట ప్రచురితం కాగా, అందులో తన భావాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. నియంతృత్వం, కమ్యూనిజంతో కూడిన ప్రభుత్వం పాలిస్తేనే ఇండియా దారిలో పడుతుందని ఆయన ఆ పుస్తకంలో రాశారు. దీన్ని ఆయన సామ్యవాదంగా ఆయన అభివర్ణించారు. 1935 లో రోమ్ కు వెళ్లిన నేతాజీ ఆనాటి ఇటలీ నియంత ముస్సోలినీని కలిసి తన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు కూడా. గత కొంతకాలంగా నేతాజీ గురించి పలు సందేహాలు వస్తుండటం. ఆయన అదృశ్యంపై నెలకొన్న సందేహాలు, ప్రభుత్వ ఆధీనంలోని పలు పత్రాల సమాచారం తదితర అంశాలపై మోదీ సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ