కుక్కల కోసం మసాజ్ లు, ఏసీ హోటళ్లు!!

August 06, 2015 | 01:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
spa_hotels_for_dogs_in_jaipur_niharonline

విశ్వాసానికి మారుపేరు కుక్క. మనుషుల కన్నా అవే ఎంతో నయమన్న సంగతి ప్రతీ మనిషీ ఒప్పుకోవాల్సిందే. అందుకే పెంపుడు కుక్కలను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న రోజులివి. కొందరు యజమానులైతే మనుషులతో సమానంగా చూసుకుంటూ వాటి సౌకర్యాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలా శునకాల పట్ల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ రాజధాని జైపూర్ లో కుక్కల కోసం ఓ ఏసీ హోటల్ ను తెరిచాడు. 20 శునకాల కోసం గదులు ఏర్పాటుతోపాటు, స్విమ్మింగ్ పూల్, స్పా ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయట. పిల్లలతో సమానంగా వాటిని చూసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఈ హోటల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుక్కల యజమానుల నుంచి మంచి స్పందన వస్తే హోటళ్లను మరిన్నీ నగరాల్లో విస్తరిస్తామని నిర్వహాకులు తెలిపారు. కుక్కలకు రోజుకు రూ.599 వసూలు చేస్తామని, బ్రేక్ ఫాస్ట్ , లంచ్, డిన్నర్, సౌకర్యాలు ఉన్నట్లు యజమానులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ కూడా ఉందట. ఇక ఈ ఆఫర్లకి వచ్చే కస్టమర్ల సంఖ్య బాగానే ఉందట. తమ యజమానుల ప్రేమతోపాటు ఏసీ హోటళ్లలో శునకరాజులు ఇప్పుడు హ్యాపీగా సేదతీరుతున్నాయి.     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ