ఢిల్లీ పనైపోయిందిగా... ఇక కశ్మీర్ సంగతి తేల్చండి

February 10, 2015 | 12:31 PM | 36 Views
ప్రింట్ కామెంట్
Omar_Abdullah_asked_BJP_for_kashmir_govt_niharonline

జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా బీజేపీకి మరో మారు గుర్తుచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకే కశ్మీర్ విషయం తేలుస్తామని బీజేపీ చెప్పిందని, ఇప్పుడు ఫలితాలు కూడా విడుదలయ్యాయని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ‘‘డియర్ బీజేపీ , జేకేడీపీ జమ్ము కశ్మీర్ లో ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటుచేస్తారా? ఢిల్లీకోసం ఆగమన్నారు, మేం ఆగాం. ఇక ఇప్పుడు ఎక్కువ కాలం ఎదురు చాడాలని మేము అనుకోవటం లేదు’’అని ట్వీట్ చేశాడు. మరోవైపు ఢిల్లీలో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్ కి ఆయన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఐదేళ్లు సీఎంగా ఉండబోతున్న కేజ్రివాల్ కు గుడ్ లక్ అంటూ ఒమర్ అభినందనలు తెలిపాడు. ఆప్ పై పోరాడలనుకుంటున్న ప్రతిపక్షాలు భవిష్యత్ లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలని ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు సూచించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ