కేరళ ‘నిర్భయ’ ఉదంతం వెనుక ప్రేమ కోణం?

May 06, 2016 | 12:13 PM | 2 Views
ప్రింట్ కామెంట్
kerala-nirbhaya-Jisha murder-case-niharonline

ఢిల్లీ నిర్భయ ఉదంతాన్ని గుర్తు చేసిన ఘటన. ఒక న్యాయ విద్యార్థిని అత్యాచారం చేసి, ఆపై  పైశాచికంగా హత్య చేసిన ఘటన కేరళలో ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్ కు చెందిన ఒక పేద దళితురాలి రాజేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారి పేర్లు జిషా, దీపలు. రాజేశ్వరి భర్త 2004లో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరి కూతుళ్లని కంటికి రెప్పల్లా పెంచింది. అంతేకాదు కూలీ పనులు చేస్తూ జిషాను లా చదివిస్తుంది కూడా. అయితే ఒంటరిగా ఆమెను, పిల్లలను చులకనగా చూడటం, రాత్రి అయితే చాలు వారి ఇంటి వైపు ఆకతాయిల వెకిలి చేష్టలు ఎక్కువగా ఉండేవి. ఇంటి మీద రాళ్లు వేయటం, రాత్రిళ్లు టార్చ్ వేసి ఇబ్బంది పెట్టటం, బయట వెళుతుంటే టీజ్ చేయటం, ఇలా వేధించేవారు. ఓపిక నశించిన ఆమె పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది. కానీ, పోలీసులు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.

                          ఇలా ఉండగా ఏప్రిల్ 28 న ఒంటరిగా ఇంట్లో ఉన్న జిషాపై దారుణం జరిగింది. చిన్న కుమార్తె దీప బయటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో జిషా విగతజీవిగా పడి ఉంది.  పోలీసుల రంగప్రవేశం మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన వైద్యబృందం షాక్ కి గురయింది. అత్యాచారం, ఆపై దాదాపు 32కు పైగా కత్తిపోట్లు పొడిచేయటం.. ఆ ధాటికి ఆ అమ్మాయి పొట్ట పేగులన్నీ బయటకు రావటంపై డాక్టర్లు సైతం కంటతడి పెట్టడం చూస్తే ఆ మానవమృగం చేసిన దాడి ఎంత దారుణమైందో అర్థమవుతుంది. తాజాగా విచారణలో బయటకు వచ్చిన విషయం ఏమిటంటే.. పసుపు రంగు టీ షర్టు ధరించిన యువకుడు ఒకడు ఆ ఇంటి నుంచి బయటకు రావటం తాము చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు స్థానికంగా ఓ యువకుడు ప్రేమ పేరుతో జిషాను విసిగించేవాడని, ఇదంతా ఆ ప్రేమోన్మాది పనేనా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా ఇంత అమానుషానికి పాల్పడ్డ ఆ రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేయాలి? ఇంత ప్రమాదకర సమాజంలో మనం బతుకుతున్నామా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ