ఆప్ అధినేతను అడవుల్లోకి పోమంటున్నాడు

January 10, 2015 | 04:28 PM | 39 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీలో తొలిరోజు ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాన మంత్రి మోదీ ధ్వజమెత్తారు. వీధుల్లో కూర్చోని ధర్నాలు చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి అదే పని అప్పగించాలని మోదీ ఎద్దేవా చేశారు. తాము మంచి ప్రభుత్వాన్ని నడపగలమని, కాబట్టే తమను ఎన్నుకోవాలని చెప్పారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని కోరారు. ఆప్ సీఎం పదవికి రాజీనామాతో ఓ సంవత్సరం వ్రుథాగా పోయిందన్న మోదీ , బీజేపీకి ఓటు వేసి అలా కాలయాపన చేసినవారికి శిక్షించాలని ఓటర్లను కోరారు. తాను అరాచకవాదినని స్వయంగా చెప్పుకున్న కేజ్రీవాల్ కు జాతీయ రాజధానిలో చోటు లేదని, అడవుల్లోకి వెళ్లిపోవాలని మోదీ సూచించారు. ఏం కావాలో ప్రజలకు బాగా తెలుసు అందుకే ప్రతిరాష్ట్రంలో కమలాన్ని వికసింపజేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ