మైనారిటీ మహరాజాస్

August 06, 2015 | 05:11 PM | 4 Views
ప్రింట్ కామెంట్
BSF_Naved_Kasim_Khan_niharonline

టీనేజి అంటె థర్టీన్ నుంచి నైంటీన్ వరకు అని భావించవచ్చు. ఈ వయసు ఒక రకంగా ప్రమాదకరమైంది. ఏ సుడిగాలి ఎటు ఈడ్చుకుపోతుందో పరిణతి కొరవైన యువతను, ఉగ్రవాద ప్రభావం బారిన పడని జాగా అరుదయిపోతోంది. అటువంటి దుష్టశక్తుల ప్రమేయంతో పిల్లలు ఎటువైపు పోతున్నారో... ఏమైపోతున్నారో తలుచుకుంటే గుండె బేజారవుతోంది.

నిన్న లష్కరే తోయిబా ముద్దుబిడ్డ నవేద్ కశ్మీర్ ప్రాంతంలో మన యువకుల చొరవతో పట్టుబడ్డాడు. ఆ పాలబుగ్గల పాపాత్ముడు మనుషుల్ని చంపడం తనకు సరదా అట, ఆ ఆటలో తన ప్రాణంపోతే అది అల్లా ఆజ్ణ అట అని ప్రవచించేడు. వీడికి ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ కరడుగ గట్టేలా మార్చి పొరుగింటి మీదకి పంపుతున్నారో సూత్రధారులు! వీడికి ఏ లెవల్లో కౌన్సిలింగ్ ఇస్తే మార్పు రాగలదో? అన్ని సుద్దులూ చెప్పి జాగ్రత్తగా రాకలేకపోయినా ఫర్వాలేదు. జైజిహాద్ అని సరిహద్దు దాటిస్తున్నారు. ఇటువంటి మూర్ఖుల్ని.

భారతదేశం ఏ మతస్థుల సొత్తూ కాదనే దానికి బొలెడు సోదాహరణంగా చెప్పొచ్చు. రాష్ట్రపతులు, సైనికాధికారులు ఎంతమంది  ఏలలేదు మనల్ని. ఎనభై శాతం హిందువులున్న ఈ దేశంలో ఇరవై శాతమే ఉన్న ముస్లింలకు భారతీయ హృదయాల్లో ఉన్న గౌరవ ప్రేమాస్పదమైన తలుచుకుంటే అబ్బురమనిపిస్తుంది. నర్గీస్, మినాకుమారి, దిలీప్ కుమార్, దర్శకుడు మెహబూబ్ ఖాన్ , కె.ఆసీఫ్ లాంటి వారిని ఎంత ప్రేమగా చూసుకుందీ భారతదేశం. ఇప్పటికీ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ యావద్భారత ప్రేక్షకలోకాన్నీ పాలిస్తున్నారనే నిజం పాక్ యువతకు బోధపడి కళ్లు తెరిస్తే హిందూముస్లిం సిక్ ఇసాయీ,  సబ్ కో మెరా సలాం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ