తాలిబన్ల చెరలో బందీగా ఉన్న తాను ప్రాణాలు అరచేతిలో పట్టకుని బిక్కుబిక్కుమంటూ గడిపానని చెబుతున్నాడు ఫాదర్ అలెక్సీస్ ప్రేమ్ కుమార్. తమిళనాడుకు చెందిన ఈ ఫాస్టర్ ని 8 నెలల క్రితం కాబూల్ లో తాలిబన్లు కిడ్నాప్ చేసి బందీగా చేసుకున్నారు. ఇక ఇటీవల చర్చలు సఫలం కావటంతో ఆయనను విడుదల చేశారు. దీంతో సోమవారం ఉదయం కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చోరవ కారణంగానే తనకి విముక్తి లభించిందని ఆయన అన్నాడు. ‘‘మోదీ లేకుంటే నా ప్రాణాలు పోయేవి. నేను వారి చెర నుంచి కాబూల్ విమానాశ్రయానికి చేరగానే మోదీ నాతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే నా భార్య, పిల్లలతో వెళ్లి ఆయనను కలుస్తాను’’ అని ప్రేమ్ కుమార్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు.. ఇక ప్రేమ్ కుమార్ విడుదల గురించి ప్రధాని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. క్త్రైస్తవులను ఎలాంటి సమస్యలనుంచైనా రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ప్రకటించిన వారంలోపే ప్రేమ్ కుమార్ విడుదల కావటం విశేషం.