మన జాతీయపక్షికి గోవాలో నూకలు చెల్లాయి

February 12, 2016 | 04:16 PM | 2 Views
ప్రింట్ కామెంట్
india-national-bird-Peacock-vermin-in-Goa-niharonline

నెమలి మన జాతీయ పక్షి... చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అదే పుస్తకాల్లో దానికి ఏ హాని కలిగించకూడదని, ఒకవేళ అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని కూడా ఉంటుంది. పురి విప్పి ఆడే ఆ అందమైన పక్షులపై వేటగాళ్ల బారినపడి ప్రస్తుతం  ప్రమాద స్థాయికి చేరుతున్నాయని జంతురక్షణ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. అలాంటి పక్షుల విషయంలో  గోవా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారటంతోపాటు వివాదాస్పదంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెమళ్లు ఎక్కడా కనపడ్డా నిర్దాక్షిణ్యంగా చంపేయాలని గోవా ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీచేసింది. ఇంతకీ అవి చేసిన పాపం ఏంటంటే పంటపొలాలను నాశనం చేయటం. అలా రైతన్నలకు శోకాన్ని మిగులుస్తున్న నెమళ్లను చంపివేయాలంటూ గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

                                     పంట పొలాలను నాశనం చేసే జంతువుల జాబితాలో జాతీయపక్షి నెమలి ని చేర్చుతున్నట్లు గోవా వ్యవసాయశాఖ మంత్రి రమేశ్ తవాడ్కర్ పేర్కొన్నారు. కోతులు, అడవి పందులలాగే నెమలి కూడా పంట పొలాలలను నాశనం చేస్తున్నాయని, రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశమైన గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తవాడ్కర్ చెప్పారు. దీని ప్రకారం అవసరమైతే ఆయా జంతువులను చంపేయొచ్చన్నమాట. కాగా, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1లో నెమళ్ల సంరక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నాయి. మరి అందుకు భిన్నంగా గోవా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం న్యాయస్థానం గడప తొక్కకుండా ఎలా ఉండగలుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ