ప్రణాళిక సంఘం పేరు మారింది

January 01, 2015 | 12:53 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ముందుగా ప్రకటించినట్టే ప్రణాళికా సంఘం పేరును మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ గా వ్యవహారించబడుతుంది. దీంతో 1950 నుంచి సేవలందిస్తున్న ప్రణాళికా సంఘం తెరమరుగు కానుంది. ముందుగా సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌, నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, సోషల్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌, భారత ప్రగతి లక్ష్య అన్న పేర్లు ప్రతిపాదనలో చేసినప్పటికీ, ఆఖరికి నీతి ఆయోగ్ అనే పేరును కేంద్రం ఖరారు చేసింది. 65 సంవత్సరాల ప్రణాళికా సంఘం చరిత్రలో ఇప్పటివరకూ 12 పంచవర్ష ప్రణాళికలు ప్రకటించగా, మొత్తం రూ.200 లక్షల కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. గత సంవత్సరంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించిన సంగతి విదితమే. ప్లానింగ్‌ కమిషన్‌ మాదిరిగానే కొత్త వ్యవస్థకు కూడా ప్రధానమంత్రే నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యవస్థలో ఇంటర్‌ స్టేట్‌ కౌన్సిల్‌, ప్లాన్‌ ఇవాల్యుయేషన్‌ ఆఫీస్‌, యూఐడిఏఐ, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ అనే నాలుగు డివిజన్లు ఉండనున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిపుణులే కాకుండా పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులు కూడా ఉంటారని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ