అక్రమాన్ని అడ్డుకున్నందుకు కోసేశారు

October 13, 2015 | 12:19 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Poling-agent-tongue-cut-off-UP

అధికార మదం మనిషిని ఎంతపనికైనా ఉసిగొల్పుతుంది. దానికోసం ఏ స్థాయికైనా దిగజారి ఏపనైనా చేస్తారు. వారినిఅలాంటి వ్యక్తులు పదవీచ్యుతులుగా మారితే మాత్రం తట్టుకోలేరు. తిరిగి అధికారం కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ తప్పులకు అడ్డువస్తే అధికారులను సైతం అస్సలు క్షమించరు. నిజాయితీగా డ్యూటీ చేసిన పాపానికి ఓ వ్యక్తి అందుకున్న నజరానా నాలుక కోల్పోవటం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఎన్నికల్లో రిగ్గింగ్ ను అడ్డుకున్న ఒక ఏజెంట్ నాలుకను కత్తిరించిన దారుణ సంఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ మధ్య అక్కడ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగింది. రాణీ గంజ్ ప్రాంతంలోని ప్రజాపతి పోలింగ్ బూత్ లో అభ్యర్థి గెలుపు కోసం అడ్డదారి తొక్కాడు. స్థానిక సంస్థ మాజీ అధ్యక్షుడు అయిన రమాకాంత్ తన కొడుకులతో కలిసి రిగ్గింగ్ చేసేందుకు యత్నించాడు. అయితే అక్కడ ఎన్నికల ఏజెంట్ గా ఉన్న ముస్తక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో రమాకాంత్, తన కొడుకులు కలిసి ముస్తక్ నాలుకను కత్తిరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమర్ ఫిర్యాదు మేరకు రమాకాంత్, ఆయన కొడుకులు, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక ఈ ఘటన పై గ్రామస్తులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అధికార పలుకుబడిని వాడుకుని వారు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ పొలింగ్ ఏజెంట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ