కేరళ బస్టాండ్ లో బ్లూ ఫిల్మ్ కలకలం

June 18, 2015 | 03:26 PM | 1 Views
ప్రింట్ కామెంట్
blue_film_broadcast_in_kerala_busstand_niharonline

ప్రజల ఆహ్లాదం కోసం ఓ బిజీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన టీవీల్లో బ్లూ ఫిల్మ్ ప్రత్యక్షం కావటం కేరళలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. కేరళలోని కాల్పేట పట్టణంలో బస్ స్టేషన్ లో బస్సులు వస్తూ... పోతూ ఉన్నాయి. ప్రయాణికులు అక్కడి టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాణిజ్య ప్రకటనల స్థానంలో హఠాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. ఇక ఇది చూసిన ప్రయాణికులు ఔరా అనుకుంటూ అక్కడి నుంచి దూరం వెళ్లారు. మహిళా ప్రయాణికుల సంగతి అయితే మరి దారుణం. బిత్తర పోవటం వారి వంతయ్యింది. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి వచ్చేలోపు జరగాల్సిందంతా జరిగింది. దాదాపు అరగంట పాటు ‘ఆ’ చిత్రం ప్రసారమయ్యిందట. ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పు అతనిదే అని తేల్చారు. వాణిజ్యప్రకటనల సీడీల స్థానంలో అశ్లీల చిత్రాల సీడీలు జత చేసి కేబుల్ ఆపరేటర్ వదిలాడని చెప్పారు. అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. అక్షరాస్యతలో టాప్ పోజిషన్ లో ఉన్న కేరళలోనే ఇలాంటి ఘటన జరగటం శోచనీయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ