నాడు యువనేతకు మొర... గతి లేక నేడు ఆత్మహత్య

June 11, 2015 | 01:12 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Farmer_Surjit_Singh_who_talking_to_Rahul_Gandhi_suicide_niharonline

సుమారు ఆరు వారాల క్రితం... రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ భరోసా యాత్ర చేస్తున్న సమయం. అందులో భాగంగా పంజాబ్ లో ఆయన పర్యటిస్తున్నారు. ఆ సమయంలో తెల్లని తలపాగా ధరించిన సుర్జిత్ సింగ్ అనే 60 ఏళ్ల ఓ వృద్ధుడు రైతు పంట నష్టం గురించి రాహుల్ వద్ద ప్రస్తావించాడు. రాహుల్ వైపు వేలెత్తి చూపుతున్న ఆ చిత్రం ప్రముఖంగా అన్ని జాతీయ మీడియాల్లో ప్రచురితమైంది. అయితే పంట దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గం లేక అదే రైతు ప్రస్తుతం నేలకొరిగాడు. ఈ ఘటన ప్రస్తుతం పంజాబ్ లో కలకలం రేపుతోంది. తాము ఎలా నష్టపోయామో రైతుల తరపున సుర్జీత్ ఆ సమయంలో రాహుల్ కు క్షుణ్ణంగా వివరించాడు. రైతుల తరపున కేంద్రానికి తమ వేదన చేరవేయాలని ఆయన రాహుల్ కు విజ్నప్తి కూడా చేశాడు. కానీ, కేంద్రం తరపున నుంచి కాదు కదా... కనీసం రాహుల్ తరపు నుంచి కూడా ఎలాంటి సాయం అందలేదు. దీంతో అప్పుల ఎలా తీర్చాలో దారి తెలియక ఆయన ఆత్మహత్య చేసకున్నాడు. కాగా, ఈ ఏడాది అకాల వర్షాలతో పంజాబ్ లో మొత్తం 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా కేంద్రం కిక్కరుమనకుండా ఉండటం శోచనీయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ