లేడీ లాయర్ : తప్పతాగి కారుతో గుద్ది ఇద్దరిని పైకి పంపింది

June 10, 2015 | 12:25 PM | 0 Views
ప్రింట్ కామెంట్
drunken_lady_lawyer_accident_kills_2_persons_niharonline

మద్యం నిషా మనిషిని మానసిక స్థితి కోల్పోయేలా చేయటమే కాదు, తరచూ ప్రమాదాలకు కూడా కారణమౌతోంది. ఓ మహిళ అయి ఉండి, పైగా గౌరవ ప్రదమైన హోదాలో ఉండి కూడా మద్యం మత్తులో చేసిన పని ఇద్దరి ప్రాణాలను బలిగొంది. బాగా తాగిన ఓ మహిళా న్యాయవాది తన కారుతో ఓ టాక్సీని ఢీకొనడంతో టాక్సీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే  మరణించారు. ముంబైకి చెందిన జాహ్నవి గడ్కర్ (35) అనే మహిళా న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును మద్యం మత్తులో రాంగ్ రూట్ లో నడిపింది. టాక్సీని ఢీకొట్టేందుకు కొద్ది ముందు ఆమె రెండు బైకులను కూడా ఢీకొట్టబోయి... తృటిలో తప్పించింది. అంతే కాదు ప్రమాదం తర్వాత తాను మద్యం తాగినట్లు వైద్యుల వద్ద ఆమె అంగీకరించిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాన్ దార్ తెలిపారు. టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57)  అనే ఇద్దరు వృద్ధులు ప్రమాదంలో అక్కడిక్కడే మరణించారు. ప్రమాదం కారణంగా టాక్సీ ముందు భాగం, కారు ముందు భాగం కూడా తుక్కుతుక్కుగా మారాయి. ఆ తీవ్రతను చూస్తేనే ఆమెగారి ఏరేంజ్ లో ప్రమాదం చేశారో స్పష్టమౌతోంది. ఇక సదరు లేడీ లాయర్ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్నారు. వాదించే ఆమె మీదే పలు సెక్షన్ల కింద ఇప్పుడు పోలీసులు కేసులు నమోదుచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ