ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెడ్డీలు విప్పేస్తున్నారు

March 11, 2016 | 12:44 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rss-goodbye-to-khaki-knickers-niharonline

దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఆర్ఎస్ఎస్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సేవకులను కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. బీజేపీ అనుబంధ సంస్థగా, మిత్రపక్షంగా కొనసాగుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సేవా కార్యక్రమాలతోనే సాగిపోతుంది. త్వరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యూనిఫాం మారనుంది. సాంప్రదాయంగా వస్తున్న మోకాళ్ల వరకూ ఉన్న ఖాకీ లాగుల స్థానంలో నీలం లేదా బూడిద రంగు ప్యాంట్లు రానున్నాయని సమాచారం.  శుక్రవారం నుంచి రాజస్థాన్ లో మూడు రోజుల పాటు జరగనున్న ఆర్ఎస్ఎస్ సదస్సులో ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

                                నిజానికి యూనిఫాంను మార్చాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ అంశాన్ని ఇప్పటి సమావేశం ఎజెండాలో చేర్చారు. కార్యకర్తలతో చర్చించిన మీదట కొత్త యూనిఫాంపై ప్రకటన వెలువడుతుందని ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పటికే వెల్లడించారు. కాగా, దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఆర్ఎస్ఎస్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సేవకులను కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అంటే కేవలం హిందు ఆర్గనైజేషన్ కాదని ప్రపంచానికి చాటి చెప్పేందుకు క్ట్రిస్టియన్ విభాగాన్ని కూడా త్వరలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. రాష్ట్రీయ ఇసాయ్ మంచ్ పేరిట ముస్లిం విభాగం దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ