గ్యాంగ్ రేప్ చేసి, వ్యభిచార గృహంలో అమ్మేశారు

March 10, 2016 | 01:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
nalanda-girl-gang-rape-sold-brothel-house-niharonline

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు దారుణ రీతిలో జరగటం రోజూ చూస్తున్నాం. మృగాల కన్నా హీనంగా విచక్షణ కోల్పోయి ఘోరాలకు తెగబటం, చట్టాలు వారిని ఏం చేయలేక చేతులెత్తయటం రివాజుగా మారిపోయింది. తాజాగా మరో ఘటన అమ్మాయిల భద్రతపై నీలినీడలు నమ్ముకునేలా చేస్తోంది. స్నేహితులని నమ్మి వెళ్లినందుకు, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆ కామాంధులు ఆపై ఏకంగా వ్యభిచార గృహానికి అమ్మేశారు.

               బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఓ డిగ్రీ యువతిని పుట్టిన రోజు పార్టీకి స్నేహితులు ఆహ్వానించారు. స్నేహితులే కదా అన్న భరోసాతో ఆమె ఆ పుట్టిన రోజు వేడుకలకు హాజరైంది. అయితే ఆమెపై ఎప్పటి నుంచో కన్ను ఉన్న వారు తెగించారు. కాళ్లు, చేతులు కట్టేసి పైశాచికంగా ఆ నలుగురూ మృగవాంఛ తీర్చుకున్నారు. ఆ తరువాత ఆమెను ఓ వ్యభిచార గృహానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను రక్షించి, వ్యభిచార గృహం నడుపుతున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అత్యాచార నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ