ఎద్దు మిస్సింగ్... పట్టిస్తే 50 వేలు! ఎక్కడ?

April 12, 2016 | 12:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bull-missing-varanasi-posters-niharonline

పవిత్ర నగరం వారణాసిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పోస్టర్ల గురించే చర్చ. గోడలపై కనిపిస్తున్న ఓ వింత ప్రకటనపై జనాలు, మీడియా అంతా హడావుడి చేస్తున్నాయి. కనబడుట లేదు అని ఉన్న ఆ పోస్టర్లో ఉంది అసలు మనిషే కాదు. ఓ ఎద్దు. సారనాథ్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ పాండే అనే వ్యక్తికి చెందిన మూడేళ్ల ఎద్దు (పేరు బాద్షా అట) తప్పిపోయిందట. వారం రోజుల క్రితం బాద్షా తప్పిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడు మనోజ్ కుమార్.

                     బాద్షా చిత్రాలతో కూడిన పోస్టర్లను ముద్రించి, దాని ఆచూకీ చెబితే రూ. 50 వేలు బహుమతిగా ఇస్తానని ప్రచారం చేస్తున్నాడు. అది కేవలం జంతువు కాదని, తమ కుటుంబంలోని సభ్యుడని, వంటగది, పడక గదుల్లోకి సైతం వస్తుందని, ఎవరినీ ఏమీ చేయదని మనోజ్ బాధతో చెబుతున్నాడు. ఇక మనోజ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్, తన గేదెలు పోయాయని ఫిర్యాదు చేసిన వేళ, ఏడుగురు సీనియర్ పోలీసు అధికారులను నియమించి మరీ సెర్చింగ్ నిర్వహించి వాటిని కనిపెట్టిన పోలీసులు, మనోజ్ ఫిర్యాదును మాత్రం లైట్ తీసుకున్నారు. అదే మంత్రికి మాములోడికి ఉన్న తేడా మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ