ధనికుల దేశంగా 4వ స్థానంలో భారత్

March 04, 2015 | 06:02 PM | 29 Views
ప్రింట్ కామెంట్
rich_list_in_india.niharonline

ఫోర్బ్స్ తాజాగా వెల్లడి చేసిన నివేదిక ప్రకారం అత్యధిక ధనవంతులున్న దేశాల్లోకి భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్ని అమెరికా, చైనా, జర్మనీలు ఉన్నాయి. ఈసారి ధనవంతుల సంఖ్య భారత్ లో మరింత పెరిగింది. నివేదికల ప్రకారం పోయిన సంవత్సరం 56 మంది కుబేరులుండగా వారి సంపద 19,150 కోట్ల డాలర్లు అంటే 11,87,300 కోట్ల రూపాలు. ఇక సంవత్సరం మన దేశ ధనవంతుల సంఖ్య 90కి పెరిగిపోయింది. వారి సంపద విలువ 29,400 కోట్ల డాలర్లు అంటే 18,22,800 కోట్ల రూపాయలు. మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా మొత్తంలో 536 మ ది బిలియనీర్లు ఉండగా, చైనాలో 213, జర్మనీలో 103 మంది ఉన్నారు. మన దేశంలో ధనికుల సంఖ్య ఏడాదికేడాది పెరగడం బట్టి చూస్తే ఆ స్థానం వచ్చే యేటికి మరింత ముందుకు జరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ పడిపోయినా ధనికుల విలువ పెరగడం బట్టి చూస్తే ఆర్థిక రంగానికి సంబంధం లేకుండా ఉంది. పేదరికం ఏ విధంగా పెరుగుతోందో, ధనికుల సంఖ్యా అదే విధంగా పెరిగిపోవడం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ