నగరాలనగానే... అన్నీ ఖరీదెక్కువ అనుకుంటుంటాం సహజంగా.... మన దేశంలోనయితే ముంబాయి, బెంగ్లూరు వంటి నగరాల్లో సామాన్యులు జీవించడం చాలా కష్టమనుకుంటుంటాం కూడా. కానీ ప్రపంచంలో అత్యంత చౌకగా బతికేయగల నగరాలు మన దేశంలోనే ఉన్నాయట. చాలా ఆశ్చర్యంగా అనిపించే అంశం ఇది. ప్రపంచ వ్యాప్తంగా చౌకగా జీవించ గలిగే ఆరు నగరాల్లో నాలుగు నగరాలు మన దేశంలో ఉన్నాయట! అవి కూడా ఇక్కడి వారు అత్యంత ఖరీదైన నగరంగా భావించే, అత్యధికంగా ఐటీ కంపెనీలు ఉన్న బెంగుళూరు మొదటి స్థానంలో ఉంది. అంటే చౌకగా జీవించే నగరంలో మొదటిది అన్న మాట. ఇది కాక మిగిలినవి ముంబయి, చెన్నై, ఢిల్లీ నగరాలు. 2015 విడుదల చేసిన నివేదికల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ఇక్కడ జీవించే ప్రజల జీతభత్యాలు, ధరలు, సబ్సిడీలు, ఇంధన ధరలపై ఆధారపడి రూపొందించింది. పాకిస్థాన్ లోని కరాచీ కూడా చౌకగా బతికేయ నగరం జాబితాలో ఉంది. ఇక ఇవే చౌకైన నగరాలంటే.... ఖరీదైన నగరాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.