సాహసాల పోటర్ ఇక లేరు

May 20, 2015 | 03:44 PM | 21 Views
ప్రింట్ కామెంట్
dean_potter_niharonline

సాహసాలు చేయడానికే పుడుతుంటారు కొందరు. వీరికి ప్రాణాల మీద తీపి ఏ మాత్రం ఉండదు. దీన్ని హాబీగా తీసుకునే వారు కొందరైతే,  ప్రాణాలకు తెగించే వారు మరికొందరు. చాలా ప్రమాదకరమైన స్టంట్స్ చేసి చాలామంది మృత్యువు అంచుల్లోకి వెళ్లొచ్చినవాళ్లు అది తమకు పునర్జమ్మగా భావిస్తుంటారు. ఇలాంటి సాహసాలు చేసిన వారి పేర్లలో డీన్ పోటర్‌ పేరు బాగా వినిపిస్తుంది. అయితే ఆదివారం అమెరికాలోని కాలిఫోర్నియా యోస్‌మైట్ నేషనల్ పార్క్‌ లో మూడువేల మీటర్లు ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో డేంజరస్ స్టంట్స్ చేస్తూ పోటర్, ఆయన పార్ట్ నర్ గ్రహం హంట్‌లు మృత్యువాతపడ్డారు. ఎంతో సేపు వెతికితేగానీ  వీళ్లిద్దరి మృతదేహాలు లభించలేదట. క్రీడా ప్రపంచంలో దేశవ్యాప్తంగా జరిగిన విషాద ఘటనల్లో ఇది ఒకటి. 43 ఏళ్ల పోటర్ అథ్లెట్ కూడా! పారాచూట్ సాయంతో వెస్ట్రన్ అమెరికాలోవుండే ఎత్తైన కొండలను సైతం ఎక్కేశాడు. ఆయన కొండలు ఎక్కిన ప్రతీసారి తనతోపాటు తన కుక్కను తీసుకొనివెళ్లేవాడు. ఇలాంటి ఘటనలు జరగడం ఈ ఏడాదిలో ఇది రెండవది. ఏప్రిల్‌లో కాలిఫోర్నియాకి చెందిన 73 ఏళ్ల వ్యక్తి, 500 అడుగుల ఎత్తునున్న ఓ బ్రిడ్జి నుంచి దూకేశాడు. కానీ ఆయన దురద్రుష్టం ఆయన పారాచూట్ ఓపెన్ కాలేదట, దాంతో చనిపోయాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ