అంతేమరీ... న్యాయమూర్తులపై నోరుజారితే ఊరుకుంటారా?

January 31, 2015 | 12:57 PM | 35 Views
ప్రింట్ కామెంట్

ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే పర్యావననాలు వేరేలా ఉంటాయి. జడ్జిలను పూల్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసిన కేరళ సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎంపీ జయరాజన్ పై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్ని ఉద్దేశంతో జూన్ 23, 2010 న కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ రహదారుల పక్కన బహిరంగ సభలను నిషేధించింది. దానిపై మండిపడిన జయరాజన్, తీర్పు చెప్పిన జడ్జిలను ఫూల్, ఇడియట్ అంటూ పరుష పదజాలంతో దూషించారు. వెంటనే స్పందించిన హైకోర్టు ఆయను కోర్టు దిక్కారం కింద దోషిగా నిర్ధారించి, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తర్వాత శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం నాలుగు వారాలకు కుదించింది. తీర్పులపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేదిలేదని హెచ్చరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ